విద్యార్థులు భయాందోళన చెందకుండా..

విద్యార్థులు భయాందోళన చెందకుండా..

ఊట్కూర్, ఆంధ్రప్రభ : ఇంటర్మీడియట్ విద్యార్థులు భయాందోళన చెందకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయాలని ఊట్కూర్ ఉప సర్పంచ్ ఆర్. రమేష్, బీజేవైఎం నారాయణపేట జిల్లా అధ్యక్షులు ఎం. భరత్ అన్నారు. బుధవారం నారాయణపేట జిల్లా ఊట్కూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రారంభమైన ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రానికి వెళ్లి విద్యార్థులకు పరీక్షల పట్ల మనోధైర్యాన్నిఇచ్చారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. విద్యార్థులు ఇష్టపడి చదివి ఉత్తమ ఫలితాలు సాధించాలని పరీక్షల పట్ల ఆందోళన చెందకుండా శ్రద్ధతో రాయాలన్నారు. ప్రతి విద్యార్థి పరీక్షలు ప్రశాంత వాతావరణంలో రాస్తూ ఉత్తమ ఫలితాలు సాధించి మండలానికి మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలన్నారు. పరీక్షలు రాసే విద్యార్థులకు ఏర్పాటు చేయాల్సిన వసతులను గురించి కళాశాల సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply