సీఎం సహాయనిధి పేద ప్రజల ఆరోగ్య భద్రతకు భరోసానిస్తుంది..

వెల్దండ, ఆంధ్రప్రభ ; సీఎం సహాయనిధి పేద ప్రజల ఆరోగ్య భద్రతకు భరోసానిస్తుందని వెల్దండ గ్రామ సర్పంచ్ మట్ట యాదమ్మ వెంకటయ్య గౌడ్ అన్నారు. ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి సహకారంతో మండల కేంద్రానికి చెందిన టి. స్వరణ్ సింగ్ కి మంజూరైన రూ. 13వేలు సీఎంఆర్ఎఫ్ చెక్కుని స్థానిక సర్పంచ్ మట్ట యాదమ్మ వెంకటయ్య గౌడ్ మంగళవారం బాధితునికి అందజేశారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం యూత్ మండల అధ్యక్షుడు బొక్కల శ్రీను, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మట్ట భరత్ గౌడ్, రమేష్ , శివ రాజ్ , ఎరుకలి మహేష్ తదితరులు పాల్గొన్నారు.
