ట్రాఫిక్ జామ్ నివారణలో ఆటో డ్రైవర్లకు సూచనలు

ట్రాఫిక్ జామ్ నివారణలో ఆటో డ్రైవర్లకు సూచనలు
పెడన – ఆంధ్రప్రభ : పెడన పోలీస్ స్టేషన్ పరిధిలో ట్రాఫిక్ రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో పెడన ఎస్‌ఐ షేక్ బషీర ఆటో డ్రైవర్లతో సమావేశం నిర్వహించి ప్రత్యేక సూచనలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ షేక్ బషీర మాట్లాడుతూ రోడ్లపై అడ్డంగా ఆటోలు నిలిపివేయకూడదని, ప్రయాణికులను ఎక్కించడం–దింపడం కోసం నిర్దిష్ట ప్రదేశాలను మాత్రమే ఉపయోగించాలని సూచించారు.
అదేవిధంగా స్కూల్ సమయాలు మరియు పీక్ అవర్స్ సమయంలో రోడ్లపై క్రమశిక్షణ పాటిస్తూ ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడకుండా సహకరించాలని కోరారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఆటో డ్రైవర్లు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని హెచ్చరించారు.
