న్యాయవాదుల రక్షణ చట్టం అమలు చేయాలి….

న్యాయవాదుల రక్షణ చట్టం అమలు చేయాలి….

  • కర్నూలు నాలుగో పట్టణ సీఐపై తక్షణ చర్యలు తీసుకోవాలి
  • కర్నూలులో న్యాయవాదుల నిరసన

కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ : న్యాయవాదుల రక్షణ చట్టాన్ని తక్షణమే అమలు చేసి, కర్నూలు నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్ సీఐపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సోమవారం కర్నూలు కొండారెడ్డి బురుజు వద్ద న్యాయవాదులు మానవహారం, ధర్నా నిర్వహించారు.

విధి నిర్వహణలో ఉన్న న్యాయవాది ఎం. పవన్ కుమార్‌పై అనుచితంగా ప్రవర్తించిన ఘటనను ఖండిస్తూ పెద్ద ఎత్తున న్యాయవాదులు ఆందోళనకు దిగారు. సీఐపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కర్నూలు బార్ అసోసియేషన్ అధ్యక్షులు చౌదరి, బాలు, వెంకటేష్, తదితరులు ప్రాతినిత్యం వహించారు.

Leave a Reply