మావోయిస్టు నాయకులను కోర్టులో హాజరుపర్చాలి..

మావోయిస్టు నాయకులను కోర్టులో హాజరుపర్చాలి..

  • అరెస్టులపై అనుమానాలు…
  • చట్టపరమైన ప్రక్రియ పాటించాలి..
  • పూర్వ విప్లవ విద్యార్థి వేదిక ఆంధ్రప్రదేశ్ శాఖ..

విజయవాడ, ఆంధ్రప్రభ : మావోయిస్టు పార్టీకి చెందిన పలువురు ముఖ్య నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం వెలువడుతున్న నేపథ్యంలో, వారిని తక్షణమే కోర్టులో హాజరుపర్చాలని పూర్వ విప్లవ విద్యార్థి వేదిక ఆంధ్రప్రదేశ్ శాఖ డిమాండ్ చేసింది. మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్ జీ, పోలిట్‌బ్యూరో సభ్యుడు మల్లా రాజిరెడ్డి అలియాస్ సంగ్రామ్‌తో పాటు మరికొందరు నాయకులను తెలంగాణ పోలీసులు అరెస్టు చేసినట్లు వార్తలు వస్తున్నాయని వేదిక పేర్కొంది. అయితే.. ఈ అరెస్టుల పై అధికారిక స్పష్టత అవసరమని అభిప్రాయపడింది.

అదుపులో ఉన్న నాయకుల పై లొంగిపోవాలని ఒత్తిడి తెస్తున్నారనే సమాచారం వస్తోందని వేదిక ఆరోపించింది. ఇటువంటి పరిస్థితుల్లో చట్టబద్ధమైన విధానాలను పాటిస్తూ, వారిని ఆలస్యం చేయకుండా కోర్టులో హాజరుపర్చాలని డిమాండ్ చేసింది. ఈ విషయం పై ప్రజలు, ప్రజాస్వామ్యవాదులు స్పందించి ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకురావాలని వేదిక కన్వీనర్ ఆర్. భరద్వాజ్ విజ్ఞప్తి చేశారు. చట్టపరమైన హక్కులు కాపాడబడేలా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఈ మేరకు ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని వేదిక డిమాండ్ చేసింది.

Leave a Reply