Shabad | హంతకుడు రాజ్‌కుమార్ ఆచూకీ లభ్యం..?
నిందితుడి కోసం ఉత్కంఠభరిత ఆపరేషన్..
Shabad | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన షాబాద్ బహుళ హత్యల కేసు నిందితుడు రాజ్‌కుమార్ ఆచూకీ లభించినట్లు సమాచారం. అతడు ప్రస్తుతం సూర్యాపేట జిల్లాలో ఉన్నట్లు పోలీసులకు విశ్వసనీయ సమాచారం అందినట్లు తెలిసింది.
ఈ సమాచారంతో హైదరాబాద్ డీసీపీ యోగేష్ గౌతమ్ సూర్యాపేట జిల్లా ఎస్పీతో ఫోన్లో మాట్లాడి పరిస్థితిని సమీక్షించినట్లు సమాచారం. అనంతరం రాజ్‌కుమార్‌ను పట్టుకునేందుకు ప్రత్యేక పోలీసు బృందాలు హుటాహుటిన సూర్యాపేటకు బయల్దేరాయి.
అయితే, రాజ్‌కుమార్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారనే అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు. అతడి కోసం గాలింపు కొనసాగుతోందని, త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడించే అవకాశం ఉందని పోలీసు వర్గాలు తెలిపాయి.
