పశువుల తొట్టిని శుభ్రం చేస్తున్న యువకులు

పశువుల తొట్టిని శుభ్రం చేస్తున్న యువకులు
జైనూర్, ఆంధ్రప్రభః కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలం లోని మన్కుగూడ గ్రామపంచాయతీ పరిధిలోని కర్ణంగూడ గ్రామంలో ఆదివారం గోడం శ్రీధర్ తో పాటు మరో యువకుడు శ్రమదానం చేశారు. కర్ణం గూడ లో పశువులు త్రాగే నీటి ట్యాంక్ (తొట్టి) తీవ్ర నిర్లక్ష్యానికి గురై చాలా రోజులుగా ట్యాంక్‌లో చెత్త చెదారం పేరుకుపోయి, నీరు పూర్తిగా మురికిగా మారిన గ్రామపంచాయతీ ప్రజాప్రతినిధులు అసలు పట్టించుకోలేదని, దీంతో తమ ముందుకు వచ్చి శ్రమదానంతో పశువుల తొట్టి లోని చెత్తాచెదారం తొలగించి పరిశుభ్రం చేశామని వారు తెలిపారు.
యువకులు శ్రమదానం చేయడంతో వారు పనితీరును పలువురు ప్రశంసించారు. ఇలాగే గ్రామాల్లోని యువత ముందుకు వచ్చి గ్రామ సమస్యలపై దృష్టి సారిస్తే కొంతమేరకు సమస్యలు పరిష్కారం తోపాటు ప్రజాప్రతినిధులకు, అధికారులకు సంబంధిత ఉద్యోగులకు నాయకులకు కనువిప్పు కలిగిస్తాయని ప్రజలు పేర్కొంటున్నారు.
