the poet | ప్రపంచ తెలుగు కవుల మహాసభలో రవీందర్

the poet | ప్రపంచ తెలుగు కవుల మహాసభలో రవీందర్
the poet | చిట్యాల,ఆంధ్రప్రభ : జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని జడల్ పేట గ్రామ శివారు భీష్మ నగర్ కి చెందిన కవి, రచయిత , చిత్రలేఖన ఆర్టిస్ట్, పుట్టకొక్కుల రవీందర్, శనివారం,పొట్లూరి హరికృష్ణ ఆధ్వర్యంలోఅంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో పాల్గొన్నారు. ప్రపంచ తెలుగు కవుల మహాసభలకు హాజరైన రవీందర్ ను ముఖ్య అతిథులుగా విచ్చేసిన మాజీ ఉపరాష్ట్రపతి , ముప్పవరపు వెంకయ్య నాయుడు , పొట్లూరి హరికృష్ణ , రవీందర్ ను ప్రపంచ తెలుగు కవుల సంఘం, త్రివర్ణ ఫౌండేషన్ అభినందిస్తూ, శాలువా ప్రశంస పత్రం, జ్ఞాపకతో ఘనంగా సన్మానించి అభినందించారు
