సీఎం కప్ జిల్లా స్థాయిలో మెరిసిన సిరికొండ యువకులు

సీఎం కప్ జిల్లా స్థాయిలో మెరిసిన సిరికొండ యువకులు
సిరికొండ, ఆంధ్రప్రభ: జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్న జిల్లా స్థాయి సీఎం కప్ పోటీలలో సిరికొండ మండల కేంద్రానికి చెందిన ఇద్దరు విద్యార్థులు అరుదైన ఘనత సాధించారు. చిట్యాల గంగరాజం జావిలింగ్, కానపురం గౌతమ్ 400 మీటర్ల పరుగు పందెంలో జిల్లా స్థాయిలో రాణించినట్లు వారి మిత్రులు తెలిపారు. చిట్యాల గంగరాజం, కానపురం గౌతంలు జావిలింగ్, 400 మీటర్ల పరుగు పందెంలో సీఎం కప్ జిల్లా స్థాయిలో మొదటి స్థానంలో నిలిచారు.
