ప్రజల రక్షణే మా బాధ్యత

ప్రజల రక్షణే మా బాధ్యత

  • జిల్లా డీసీపీ ఏ భాస్కర్

రామకృష్ణాపూర్, ఆంధ్రప్రభ ; రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్ ను శనివారం మంచిర్యాల డిసిపి భాస్కర్ తనఖీ చేసి రికార్డులను పరిశీలించారు. అనంతరం డీసీపీ భాస్కర్ మాట్లాడుతూ క్యాతన్ పల్లి మున్సిపాలిటీ పరిధిలోని ప్రజలు, రామకృష్ణాపూర్ పట్టణ ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని ,ఏమైనా అలజడి జరిగితే 100కి ఫోన్ చేయాలని అన్నారు సోషల్ మీడియాలో వికృతమైన పోస్టులు చేస్తే కఠినమైన చర్యలు తీసుకుంటామని అన్నారు. కౌన్సిలర్ ల ప్రమాణ స్వీకారం రోజు జరిగిన అలజడి, మంత్రి కాన్వాయ్ వద్ద జరిగిన అలజడి సృష్టించిన వారిపై వీడియో ఫుటేజ్ ద్వారా సేకరించి కేసులు పెడతామని అన్నారు.శాంతి భద్రతలు ఎవరైనా ఉల్లంఘిస్తే కేసులు పెడతామని హెచ్చరించారు. రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రజలంతా ప్రశాంతంగా ఉండాలని,ప్రజలకు పోలీసులు ఎల్లవేళలా అందుబాటులో ఉంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి ఏసిపి రవికుమార్, మందమర్రి సిఐ, పరస రమేష్, ఆర్కేపి ఎస్ఐ జాడీ. శ్రీధర్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply