Threats | రూ.10 కోట్లు ఇవ్వండి..

Threats | రూ.10 కోట్లు ఇవ్వండి..

Threats |ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : ఇటీవ‌ల కాలంలో దుండ‌గుల నుంచి బెదిరింపు ఘ‌ట‌న‌లు ఎక్కువ‌య్యాయి. గ‌త కొన్ని రోజుల క్రితం ప్రముఖ నటుడు రణ్‌వీర్‌ సింగ్‌ (Actor Ranveer Singh) కు బెదిరింపులు వ‌చ్చాయి. అయితే తాజాగా.. ప్రముఖ నటుడు రణ్‌వీర్‌ సింగ్‌కు మరోసారి బెదిరింపులు వచ్చాయి. బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి బెదిరింపులు ఎదురైనట్టు తెలుస్తోంది. రూ.10 కోట్లు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ వాయిస్‌ నోట్‌ వచ్చింది.

హీరో మేనేజర్‌ వాట్సాప్‌నకు ఓ అమెరికన్‌ నంబర్‌ నుంచి ఈ నోట్‌ వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో నటుడి ఇంటి వద్ద పోలీసులు బందోబస్తు పెంచారు. ఈ నేపథ్యంలో ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఆ నెంబర్‌కు సంబంధించిన వివరాలు కోసం అమెరికా అధికారులను సంప్రదించినట్టు తెలుస్తోంది.

Leave a Reply