Dhurandar 2 | పోస్ట్ పోన్ నిజమేనా…?

Dhurandar 2 | పోస్ట్ పోన్ నిజమేనా…?

Dhurandar 2 | 1300 కోట్ల సంచలనం తర్వాత ‘ధురందర్ 2’పై భారీ అంచనాలు
మార్చి 19 రిలీజ్‌కు బ్రేక్ పడిందా?
ముంబాయి కార్పొరేషన్‌తో వివాదం.. షూటింగ్‌కు అడ్డంకులు
వార్నింగ్ ఇచ్చినా షూటింగ్.. బ్లాక్‌లిస్ట్ చర్చ
వాయిదా ఖాయమా? అధికారిక ప్రకటన కోసం ఎదురు చూపులు

ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : ఇండియన్ బాక్సాఫీస్ ని షేక్ చేసిన బాలీవుడ్ మూవీ ధురందర్. బాలీవుడ్ స్టార్ రణ్‌ వీర్ సింగ్ హీరోగా ఆదిత్య ధర్ తెరకెక్కించిన ఈ సినిమా పెద్దగా అంచనాలు లేకుండా వచ్చింది. కొత్త రికార్డులు క్రియేట్ చేసింది. దాదాపు 1300 కోట్లకు పైగా కలెక్ట్ చేసి సెన్సేషన్ క్రియేట్ చేసింది. దీంతో ధురందర్ 2 పై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. మార్చి 19న ధురందర్ 2 వస్తుందని అనౌన్స్ చేశారు. భారీ పాన్ ఇండియా మూవీగా హిందీతో పాటు మిగిలిన భాషల్లో కూడా భారీగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తుంటే.. ఇప్పుడు పోస్ట్ పోన్ అంటూ వార్తలు వస్తున్నాయి. అసలు ఏమైంది. నిజంగానే పోస్ట్ పోన్ కానుందా..?

Dhurandar 2 | ఆకాశమే హద్దు అనేలా..

Dhurandar 2

ధురందర్ మూవీ సైలెంట్ గా వచ్చి.. ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర గట్టిగా సౌండ్ చేసింది. దీంతో అటు ఆడియన్స్, ఇటు ఇండస్ట్రీ జనాల దృష్టి ధరందర్ 2 పై పడడంతో.. ఆకాశమే హద్దు అనేలా అంచనాలు ఏర్పడ్డాయి. ఆ అంచనాలకు మించి ఉండేలా ఈ సినిమాని రూపొందిస్తున్నారని.. ఖచ్చితంగా ధురందర్ 2 బాక్సాఫీస్ ని షేక్ చేయడం ఖాయమని టీమ్ గట్టి నమ్మకంతో ఉన్నారు. ఇదిలా ఉంటే.. ధురందర్ 2 ఇప్పుడు అనుకోని వివాదంలో చిక్కుకుంది. ఆ వివాదం నుంచి బయటపడితేనే కానీ.. సినిమా అనుకున్న టైమ్ కి రిలీజ్ కాదని ప్రచారం జరుగుతుంది.

Dhurandar 2 | వార్నింగ్ ఇచ్చినా..

Dhurandar 2

ఇంతకీ వివాదం ఏంటంటే.. ముంబాయి నగర పాలక సంస్థ నుంచి ధురందర్ 2 నిర్మాణ సంస్థ బి62 స్టూడియోస్ తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటుంది. షూటింగ్ సమయంలో భద్రత నిబంధనలను పదే పదే ఉల్లంఘించారని ఎక్కడైతే షూటింగ్ చేసారో ఆ స్టూడియోను లోకల్ షూటింగ్స్ చేయకుండా బ్లాక్ లిస్ట్ లో పెట్టారట అధికారులు. దక్షిణ ముంబాయిలోని చారిత్రాత్మక పోర్ట్ ఏరియాలో ఈ వివాదం చోటు చేసుకుంది. అప్పటికే ఒకసారి వార్నింగ్ ఇచ్చిన తర్వాత కూడా పర్మిషన్స్ లేకుండా షూటింగ్ చేయడం.. బాణా సంచా పేల్చడం పై అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దాంతో బ్లాక్ లిస్ట్ లో చేర్చడానికి నగర పాలక సంస్థ ఆలోచిస్తుందని.. దీంతో షూట్ ఆలస్యం అవుతుందని.. ఈ కారణంగా ధురందర్ 2 వాయిదా పడడం ఖాయమని వార్తలు వస్తున్నాయి. మరి.. ఏం జరగనుందో చూడాలి.

Leave a Reply