ఊట్కూర్ లో వేసవిలో నీటి ఎద్దడి లేకుండా కృషి..

ఊట్కూర్, ఆంధ్రప్రభ ; వేసవికాలంలో ఊట్కూర్ పట్టణంలో నీటిఎద్దడి కృషి చేస్తామని ఆర్డబ్ల్యూఎస్ ఏఈ వెంకటేష్, మాజీ సర్పంచ్ భాస్కర్, ఉప సర్పంచ్ రమేష్, బీజేవైఎం జిల్లా అధ్యక్షులు భరత్ అన్నారు. గురువారం నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల కేంద్రంలో కోటవీధిలో నిర్మించిన వాటర్ ట్యాంక్ నుండి గ్రామానికి త్రాగునీరు ట్యాంకర్ ద్వారా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వేసవిని దృష్టిలో ఉంచుకొని ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ప్రణాళికలు సిద్ధం చేశామని 16 వార్డులకు నీరు సరఫరా చేస్తామన్నారు. ప్రజలు నీటిని పొదుపుగా వాడుకోవాలని పైపులు లీకేజీలు ఉంటే వెంటనే అధికారులు దృష్టికి తీసుకురావాలన్నారు.
మిషన్ భగీరథ పథకం ద్వారా స్వచ్ఛమైన త్రాగునీరు సరఫరా చేస్తున్నామని ఊట్కూర్ మండల కేంద్రంలోని కోటవీధి ప్రాంతంలో నిర్మించిన వాటర్ ట్యాంక్ నుండి నీరు ప్రారంభించడంతో పలు కాలనీలకు సకాలంలో నీరు సరఫరా చేస్తామన్నారు. ప్రజలు మిషన్ భగీరథ పథకం ద్వారా సరఫరా చేస్తున్న కుళాయి నీటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. గ్రామాభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని నీటి సమస్యలు ఉంటే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలన్నారు. గ్రామంలోని పలు కాలనీలలో పారిశుద్ధ్య పనులు విద్యుత్ దీపాలు వేస్తున్నామని దశలవారీగా సమస్యలు పరిష్కరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి అరవింద్ కుమార్, మాజీ ఎంపీటీసీ హన్మంతు, బిజెపి మాజీ మండల అధ్యక్షులు రమేష్, నాయకులు ఆశప్ప, రణవీర్, ప్రకాష్, తారా కృష్ణ, బోయిని రవి, అనిల్ గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు.
