Duddilla Sridhar babu | ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకుంటా..

Duddilla Sridhar babu | ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకుంటా..
Duddilla Sridhar babu, మంథని టౌన్, ఆంధ్రప్రభ : తెలంగాణ ఐటి, పరిశ్రమల, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి శ్రీనుబాబు సహకారంతో ప్రజల ఆశీర్వాదంతో ప్రజాసేవలో ఉన్నానని రెండో వార్డ్ కౌన్సిలర్ నూకల కమల్ పేర్కొన్నారు. గురువారం కౌన్సిలర్ కమల్ వార్డు సందర్శన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికి ఆయన వెళుతూ ఆత్మీయంగా పలకరించారు. ప్రజల సమస్యలు క్షుణ్ణంగా తెలుసుకొని వాటిని ఆయన నోట్ చేసుకున్నారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఎల్లప్పుడు ముందుంటానని ఆయన తెలిపారు.
త్వరలో వార్డు కార్యాలయం ఏర్పాటు చేసి ప్రజల హితం కోసం ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని ఆయన పేర్కొన్నారు. రెండో వార్డు ప్రజలకు ఏ కష్టం వచ్చినా క్షణంలో వారికి అందుబాటులో ఉంటానని ప్రతిజ్ఞ చేశారు. కౌన్సిలర్ కమల్ మొదటిరోజు వార్డు సందర్శన చేసిన తీరు వార్డు ప్రజలను ఆకట్టుకుంది. గెలిచిన తర్వాత ప్రజల వైపు రాని నాయకులు ఎంతో మంది ఉంటారని, కానీ మంత్రి శ్రీధర్ బాబు ఆధ్వర్యంలో ప్రజల కోసం ఎల్లప్పుడు ముందుంటానని ఆయన తెలిపారు.
