Balka suman arrest | బీఆర్ఎస్ నాయకుల ఆందోళన..

Balka suman arrest | బీఆర్ఎస్ నాయకుల ఆందోళన..
Balka suman arrest, నస్పూర్, ఆంధ్రప్రభ : మంచిర్యాల జిల్లా నస్పూర్ పట్టణంలో గురువారం బీఆర్ఎస్ నాయకులు జిల్లా బంద్ పిలుపులో భాగంగా ఆందోళన నిర్వహించారు. చెన్నూరు ఎమ్మెల్యే, భారత రాష్ట్ర సమితి జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్ అరెస్టుకు నిరసనగా పార్టీ జిల్లా బంద్ ను ప్రకటించింది.
అందులో భాగంగా స్థానిక పాఠశాలలు బంద్ నిర్వహించాలని బీఆర్ఎస్ నాయకులు కోరగా అందుకు నిరాకరించిన పాఠశాల యాజమాన్యంతో వాగ్వివాదనకు దిగడంతో సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ఆందోళనకారులని అదుపులోకి తీసుకొన్నారు. సీసీసీ నస్పూర్ ఎస్ఐ యం.ప్రశాంత్ స్థానిక పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఆందోళన కారుల్లో టీబీజేకేస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే.సురేందర్ రెడ్డి, వంగ తిరుపతి తదితరులు పాల్గొన్నారు.
