Solution | నాలుగవ తరగతి ఉద్యోగులుగా గుర్తించాలి…

Solution | నాలుగవ తరగతి ఉద్యోగులుగా గుర్తించాలి…

Solution | కర్నూలు, ఆంధ్రప్రభ : గ్రామ సేవకులను నాలుగవ తరగతి ఉద్యోగులుగా గుర్తించాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం డి అంజిబాబు డిమాండ్ చేశారు. గ్రామ సేవకులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కారం కోరుతూ రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనలో భాగంగా కలెక్టర్ కార్యాలయం ముందు ఆంధ్రప్రదేశ్ గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం జిల్లా అధ్యక్షులు రాజ్ కుమార్ అధ్యక్షతనగ్రామ సేవకులు ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు.

జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ రాజు, జిల్లా ఉపాధ్యక్షుడు మల్లయ్య నాయకత్వంలో జరిగినధర్నాను ఉద్దేశించి సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి అంజిబాబు సిఐటియు జిల్లా కోశాధికారి ఏం గోపాల్ మాట్లాడుతూ… గ్రామ సేవకులకు 2018 నుండి ఇప్పుడు వరకు జీతాలు పెరగలేదని అన్నారు. ఒక్కసారి పెరిగిన డిఏ 300ను కూడా గత ప్రభుత్వం రికవరీ చేయడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు గ్రామ సేవకులకు కనీస వేతనం 26 వేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

పక్క రాష్ట్రమైన తెలంగాణలో గ్రామ సేవకులను ఉద్యోగులుగా గుర్తిస్తూ పేస్కేలు అమలు చేస్తున్నప్పటికీ మన రాష్ట్రం మాత్రం పట్టించుకోవడంలేదని అన్నారు. పాదయాత్ర సందర్భంగా లోకేష్ గ్రామ సేవకులకు హామీలు కురిపించారని హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. అర్హులైన గ్రామ సేవకులకు వీఆర్వోలుగా ప్రమోషన్లు కల్పించాలని కోరారు అటెండర్లు గాను వాచ్మెన్ గాను అర్హులైన వీఆర్ఏలను పదోన్నతులు కల్పించాలని కోరారు. చాలా సంవత్సరాలుగా నామినేలుగా పని చేస్తున్న వీఆర్ఏలను రెగ్యులర్ వీఆర్ఏలుగా గుర్తించాలని డిమాండ్ చేశారు.

వీఆర్ఏలకు నైట్ వాచ్మెన్ డ్యూటీలను రద్దు చేయాలని ఈ సర్వే పేరుతో వీఆర్ఏలకు వేస్తున్న అదనపు భారాన్ని తగ్గించాలని ఈ సర్వే సందర్భంగా ఇతర గ్రామాలకు పంపించినట్లయితే వారికి టీడీ, డి ఏలు ఇవ్వాలని కోరారు జనరల్ ఇన్సూరెన్స్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి రఘు బాబు మాట్లాడుతూ… గ్రామ సేవకులు ఎదుర్కొంటున్న సమస్యలు చాలా న్యాయమైనవని వాటి సమస్యలు పరిష్కారం కొరకు మీరు చేస్తున్న ఆందోళనకు మా మద్దతు ఉంటుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ గ్రామ సేవకుల సంఘం జిల్లా నాయకులు శాంత, రాజు, రంగన్న, నాగరాజు ,తిరుపతి, కౌతాళం, రంగన్న, సిద్ధప్ప, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply