ఘనంగా కేసిఆర్ జన్మదిన వేడుకలు

ఘనంగా కేసిఆర్ జన్మదిన వేడుకలు

బెజ్జంకి, ఆంధ్రప్రభ : మండల కేంద్రంలో స్థానిక అంబేద్కర్ చౌరస్తా వద్ద మండల అధ్యక్షులు పాకాల మహిపాల్ రెడ్డి ఆద్వరంలో తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధకుడిగా కీర్తి ఘనించిన మహోన్నత వ్యక్తి కేసీఆర్ అని ప్రజా రైతు సంక్షేమమే లక్ష్యంగా కేసీఆర్ పాలన సాగిందని , దేశానికే ఆదర్శంగా తెలంగాణ రాష్ట్రాన్ని నిలిపిన మహోన్నత వ్యక్తి కేసీఆర్ అని కొనియాడారు. కేసీఆర్ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని ఆ లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులు ఉండాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ శ్రేణులు పాల్గొన్నారు.

Leave a Reply