Albendazole | విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రల పంపిణీ

Albendazole | విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రల పంపిణీ
Albendazole | శావల్యాపురం, ఆంధ్రప్రభ : నులిపురుగులను నివారించి రక్తహీనత నుంచి విద్యార్థులను కాపాడడానికి ఆల్బెండజోల్ మాత్రలు ఎంతగానో దోహాద పడతాయని వీటిని ప్రభుత్వం ఉచితంగా అందజేస్తున్నట్లు మండల వైద్యాధికారి రాధాకృష్ణన్ తెలిపారు. జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా మంగళవారం మండలంలోని అన్నీ అంగన్వాడీ, ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థల్లో చదువుతున్న విద్యార్థినీ విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలను పంపిణీ చేశారు. మండల కేంద్రమైన శావల్యాపురం జెడ్పీ ఉన్నత పాఠశాలలో వైద్యాధికారి రాధాకృష్ణన్ పాల్గొని విద్యార్థులచే మాత్రలను మింగించారు.
ఈ సందర్భంగా వైద్యాధికారి రాధాకృష్ణన్ మాట్లాడుతూ ప్రతి ఆరు నెలలకి ఒకసారి టాబ్లెట్స్ వేసుకోవాలని, నులిపురుగులు ఉండటం వలన రక్తహీనత, ఆకలి మందగించటం, కడుపులోనొప్పి, వాంతులు, విరోచనాలతో పాటు చదువు మీద శ్రద్ధ లేకపోవడం వంటి లక్షణాలు ఉంటాయన్నారు. మండల వ్యాప్తంగా 1-19 ఏళ్లలోపు పిల్లలు 4,915 మంది ఉండగా 4,813 మందికి మంగళవారం మాత్రలను మింగించామని 97 శాతం పైగా పూర్తయిందన్నారు.

మంగళవారం పాఠశాలకు హాజరు కాని వారికి ఫిబ్రవరి 24వ తేదీన మాత్రలను అందించనున్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం బొడ్డపాటి విజయలక్ష్మి, సూపర్వైజర్లు ఏడుకొండలు, నారాయణమ్మ, ఏఎన్ఎం శ్రీలత, ఆశ వర్కర్లు పాల్గొన్నారు.
