సేవాలాల్ జయంతికి రావాలని ఆహ్వానం..

ఉట్నూర్, ఆంధ్రప్రభ ; అదిలాబాద్ జిల్లా ఉట్నూర్ సబ్ కలెక్టర్, ఐటీడీఏ పీవో యువరాజ్ మార్మాట్, అదిలాబాద్ ఏ ఎస్ పి పి. మౌనిక ఉట్నూర్ సబ్ కలెక్టర్ నివాసంలో లంబాడ జేఏసి నాయకులు మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారికి శాలువలతో సన్మానం చేశారు. అదిలాబాద్ జిల్లా కేంద్రంలో18న బుధవారంశ్రీ సంత సేవాలాల్ మహారాజ్ 287వ జయంతి వేడుకలకు రావాలని ఆహ్వానించారు. వారు సానుకూలంగా స్పందించి తప్పకుండా హాజరు అవుతామని, ఈ ప్రాంతం వారి ప్రతి ఒక్కరి సాంస్కృతి సంప్రదాయాలను మేము గౌరవిస్తామని వారు పేర్కొన్నట్లు లంబాడ జేఏసీనాయకులు తెలిపారు. వారిని ఆహ్వానించిన వారిలో లంబాడీ జేఏసీ అదిలాబాద్ ఉమ్మడి జిల్లా శాఖ ప్రధాన కార్యదర్శి, న్యాయవాది బానోత్ జగన్ నాయక్, జిల్లా ఉపాధ్యక్షులు బానోత్ రామారావు , జిల్లా ఉపాధ్యక్షులు నేతావత్ రాందాస్ నాయక్, రాథోడ్ బానోత్ రవీందర్ లంబాడి ఐక్యవేదిక జిల్లా అధ్యక్షులు, బానోత్ దేవేందర్, పవర్ సీతారాం, జాదవ్ వసంతరావు లంబాడి ఐక్యవేదిక ఉమ్మడి జిల్లా ఉమ్మడి జిల్లా అధ్యక్షులు , అజ్మీరా వినోద్ తదితరులు పాల్గొన్నారని జేఏసీ నాయకులు తెలిపారు.

Leave a Reply