Hospital | ఆర్టీసీ బస్సు – కారు ఢీ

Hospital | ఆర్టీసీ బస్సు – కారు ఢీ
Hospital | అచ్చంపేట, ఆంధ్రప్రభ : నాగర్కర్నూల్ జిల్లా, అచ్చంపేట మండలం, లక్ష్మాపూర్ పిఎన్ గేట్ వద్ద సోమవారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. శ్రీశైలం నుంచి కోడేరు మండలానికి వెళ్తున్న కారు నెంబరు టిఎస్ 09 యుడి 9476 ఎదురుగా వస్తున్న అచ్చంపేట ఆర్టీసీ డిపోకు చెందిన బస్సు నెంబర్ టిజి 31 జెడ్ 0039 ను ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న నలుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను 108 ద్వారా అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించారు.
తీవ్రంగా గాయాలైన ఇద్దరిలో ఒకరైన కార్ డ్రైవర్ కం ఓనర్ అంజి @ ఆంజనేయులును యెన్నమ్స్ హాస్పిటల్, మరొకరిని హైదరాబాద్లోని మలక్ పేట హాస్పిటల్ కు మెరుగైన చికిత్స నిమిత్తం తరలించారు. ఘటనపై అచ్చంపేట ఆర్టీసీ బస్సు డ్రైవర్ ఉప్పరి లింగమయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు అచ్చంపేట పట్టణ ఎస్సై సద్దాం తెలిపారు.


