Commissioner |మన నగరం -మన ఇల్లు తో సమానం

Commissioner |మన నగరం -మన ఇల్లు తో సమానం
Commissioner | విజయవాడ, ఆంధ్రప్రభః మన నగరం -మన ఇల్లు తో సమానం అని, నగరాన్ని పరిశుభ్రంగా, అందంగా ఉంచాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. సోమవారం తన పర్యటనలో భాగంగా మహాత్మా గాంధీ రోడ్, వన్ టౌన్, ప్రకాశం బ్యారేజ్, భవాని ఘాట్, కృష్ణవేణి ఘాట్, ఏలూరు రోడ్, పటమట ప్రాంతాలన్నీ పర్యటించి క్షేత్రస్థాయిలో పారిశుద్ధ్య నిర్వహణ పరిశీలించారు.
నగరాన్ని పరిశుభ్రంగా, అందంగా ఉంచడం వలన ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని, ప్రతిరోజు రహదారులలో క్రమ తప్పకుండా పారిశుధ్య నిర్వహణ కచ్చితంగా నిర్వహించాలని, డ్రైన్ లోని వ్యర్ధాలను ఎప్పటికప్పుడు తొలగించాలని, కాలుష్య రహితంగా ఉంచేందుకు ప్రతిరోజు డివైడర్ల లో, రోడకు ఇరువైపులా ఉన్న మొక్కలకు నీరు పోసి వాటిని హరితంగా ఉంచేటట్టు చర్యలు తీసుకోవాలని, మన ఇంటిని పరిశుభ్రంగా ఎలా చూసుకుంటామో విజయవాడ నగరాన్ని కూడా మన ఇల్లు గా భావించి ప్రతిరోజు పరిశుభ్రంగా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ పర్యటనలో చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ కే అర్జునరావు, చీఫ్ సిటీ ప్లానర్ సంజయ్ రత్నకుమార్, డిప్యూటీ సిటీ ప్లానర్ చంద్రబోస్, సిబ్బంది, పాల్గొన్నారు.

