12 hours | మహిళల శక్తి చిట్యాల నుంచి పునాది పడాలి

12 hours | మహిళల శక్తి చిట్యాల నుంచి పునాది పడాలి

12 hours | చిట్యాల, ఆంధ్రప్రభ : చిట్యాల మున్సిపాలిటి నూతన పాలకవర్గం సోమవారం కొలువు తీరింది. మొదటగా కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం జరిగిన తర్వాత మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాలకు చైర్మన్ ఎన్నికను నిర్వహించారు చైర్మన్‌గా పందిరి గీత రమేష్, వైస్ చైర్మన్‌గా గుండెబోయిన శ్రీలక్ష్మి సైదులు లను ఏకగ్రీవంగా సభ్యులు ఎన్నుకున్నారు. అనంతరం కనకదుర్గ సెంటర్లో జరిగిన సభలో కౌన్సిలర్లను నకిరేకల్ శాసనసభ్యులు వేముల వీరేశం శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు.

శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఆర్యవైశ్య సంఘం చెర్మన్ సుజాత , డిసిసి అధ్యక్షులు పున్న కైలాష్ నేత తదితరులు పాల్గొన్న సభలో ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వంపై విశ్వాసం ఉంచారని తెలిపారు. పట్టణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారని పేర్కొన్నారు.రాబోయే ఎంపిటిసి, జెడ్పిటిసి ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.ప్రతి వార్డును సమగ్రంగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు.

ఇండ్లు లేని పేదలకు ఇండ్లను కేటాయిస్తామని తెలిపారు.బతుకమ్మ కుంట అభివృద్ధికి రూ.2 కోట్లు మంజూరు చేసినట్లు వెల్లడించారు.ఎన్నికల వరకు రాజకీయం, ఇకపై అభివృద్ధే ధ్యేయమని అన్నారు.ఎన్నికల్లో కష్టపడ్డ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు.

Leave a Reply