అన్ని రంగాల్లో మాదిగలు అత్యున్నత స్థాయికి ఎదగాలి
అన్ని రంగాల్లో మాదిగలు అత్యున్నత స్థాయికి ఎదగాలి
- ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు డా. గోవిందు నరేష్ మాదిగ
చౌటుప్పల్, ఆంధ్రప్రభ : తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన మాదిగలు విద్యా, సామాజిక, ఆర్థిక, వ్యాపార రంగాలతో పాటు రాజకీయంగానూ అత్యున్నత స్థాయికి ఎదగాలని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ గోవిందు నరేష్ మాదిగ పిలుపునిచ్చారు. చౌటుప్పల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా రెండవసారి ఎన్నికైన బోయ దేవేందర్ ను ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో శాలువా కప్పి, పూలమాలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా గోవిందు నరేష్ మాదిగ మాట్లాడుతూ.. పద్మశ్రీ మందకృష్ణ మాదిగ సాగించిన పోరాటాల వల్లే మాదిగలకు రాజకీయ గుర్తింపు లభించిందన్నారు.
బోయ దేవేందర్ చిన్నతనం నుంచే తండ్రి స్ఫూర్తితో నిస్వార్థ ప్రజాసేవకుడిగా, క్రమశిక్షణతో పనిచేస్తూ రెండవసారి అధ్యక్షుడిగా ఎన్నిక కావడం అభినందనీయమన్నారు. వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ, మూడు దశాబ్దాలుగా జాతి కోసం శ్రమిస్తున్న మందకృష్ణ మాదిగకు, ఎమ్మార్పీఎస్ ఉద్యమానికి అండగా నిలవాలని కోరారు.
ఎమ్మార్పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి బోయ లింగస్వామి మాదిగ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఉబ్బు వెంకటయ్య, మాదిగ జర్నలిస్టు ఫోరం రాష్ట్ర నాయకులు ఊదరి వెంకటేష్ మహాజన్, ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు బొడ్డు శ్రవణ్ కుమార్, ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షులు బోయ రాము, నాయకులు చింతల సాయిలు, ఆరుట్ల లింగస్వామి, బొడ్డు గణేష్, ఊదరి భాస్కర్, బోదుల స్వామి, చెక్క లింగస్వామి, వీరమల్ల సత్తయ్య, ప్రభు తదితరులు పాల్గొన్నారు.
