Chairman | మున్సిపల్ చైర్మన్ దొంతగాని శ్రీనివాస్ వైస్ చైర్మన్, తన్నీరు మల్లికార్జున్

Chairman | మున్సిపల్ చైర్మన్ దొంతగాని శ్రీనివాస్ వైస్ చైర్మన్, తన్నీరు మల్లికార్జున్
హుజూర్నగర్ మున్సిపల్ పాలకవర్గం ప్రమాణస్వీకారం
మున్సిపల్ చైర్మన్ దొంతగాని శ్రీనివాస్
వైస్ చైర్మన్ తన్నీరు మల్లికార్జున్
Chairman | హుజూర్నగర్, ఆంధ్రప్రభః హుజూర్నగర్ మున్సిపల్ కౌన్సిలర్లు గా ఎన్నికైన సభ్యులచే ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఆర్డీఓ శ్రీనివాసులు మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో ప్రమాణ స్వీకారం చేయించారు. హుజూర్నగర్ మున్సిపల్ పరిధిలో 28 వార్డులకు గాను కాంగ్రెస్ 19, బీఆర్ఎస్ 4, సీపీఎం1, సిపిఐ1, స్వతంత్రులు 3 స్థానాలలో గెలుపొందారు. గెలుపొందిన సభ్యులచే ప్రమాణ స్వీకారం చూపించిన రిటర్నింగ్ అధికారి మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, ఆర్డీవో శ్రీనివాసులు ధృవీకరణ పత్రాలు అందచేశారు.
వార్డులవారిగా గెలుపొందిన కౌన్సిలర్లు..
1వవార్డ్ మోదాల కామేశ్వరి సైదులు (కాంగ్రెస్), 2వవార్డ్ కోడి జ్యోతి ఉపేందర్ (కాంగ్రెస్), 3వవార్డ్ సులువ నాగలక్ష్మి చంద్రశేఖర్ (కాంగ్రెస్), 4వవార్డ్ దొంతిరెడ్డీ పద్మారెడ్డి (కాంగ్రెస్), 5వవార్డ్ ఎరగాని సుష్మా మురళీ (కాంగ్రెస్), 6వవార్డ్ శీలం నాగమణి శ్రీనివాస్ ( సిపిఎం), 7వవార్డ్ వల్లేపు నాగరాజు (బిఆర్ఎస్), 8వవార్డ్ ఉదయ బాను (కాంగ్రెస్), 9వవార్డ్ బొల్లెద్దు దనమ్మ (కాంగ్రెస్), 10వవార్డ్ చెన్నగాని సైదులు( సిపిఐ), 11వవార్డ్ పులిచింతల వెంకటరెడ్డి (కాంగ్రెస్), 12వవార్డ్ అమరారపు ప్రవీణ్ (స్వతంత్ర ), 13వవార్డ్ చిన్నపంగు సావిత్రి (కాంగ్రెస్), 14వవార్డ్ దగ్గుపాటి కవిత బాబురావు (స్వతంత్ర), 15వవార్డ్ నల్లగొండ సుజాత చంటి (బిఆర్ఎస్), 16వవార్డ్ చిట్టిపోతుల భద్రమ్మ (బిఆర్ఎస్), 17వవార్డ్ బెల్లంకొండ సంధ్య అమర్ (బిఆర్ఎస్), 18వవార్డ్ జక్కుల మల్లయ్య (కాంగ్రెస్).
19వవార్డ్ వల్లపుదాసు కృష్ణ (స్వతంత్ర), 20వవార్డ్ దొంతగాని శ్రీనివాస్ (కాంగ్రెస్), 21వవార్డ్ తన్నీరు మల్లికార్జున్ రావు (కాంగ్రెస్), 22వవార్డ్ అమరబోయిన ఊహ సతీష్ (కాంగ్రెస్), 23వవార్డ్ అట్లూరి మంజుల హరిబాబు (కాంగ్రెస్), 24వవార్డ్ యడ్ల విజయ్ (కాంగ్రెస్), 25వవార్డ్ కోతి సంపత్ రెడ్డి (కాంగ్రెస్), 26వవార్డ్ బెల్లంకొండ లలిత శ్రీనివాస్ (కాంగ్రెస్), 27వవార్డ్ తండు.ప్రసాద్ (కాంగ్రెస్), 28వవార్డ్ నందిగామ శ్రీనివాస్ (కాంగ్రెస్) లు ప్రమాణం చేశారు. అనంతరం కౌన్సిల్ సభ్యులు ఏకగ్రీవంగా ఛైర్మన్ గా దొంతగాని శ్రీనివాస్, వైస్ ఛైర్మన్ గా తన్నీరు మల్లికార్జున్ లను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు చందా శ్రీనివాస్, ఎమ్. అశోక్, వినోద్, తదితరులు పాల్గొన్నారు.

