Collector | 15వ వార్డు కౌన్సిలర్‌గా చింతల వసంత….

Collector | 15వ వార్డు కౌన్సిలర్‌గా చింతల వసంత….
Collector | బెల్లంపల్లి, ఆంధ్రప్రభ : బెల్లంపల్లి మున్సిపాలిటీ 15వ వార్డు కౌన్సిలర్‌గా ఎన్నికైన కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ కౌన్సిలర్ చింతల వసంత సోమవారం అధికారికంగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. స్థానిక మున్సిపల్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎన్నికల అధికారి, సబ్ కలెక్టర్ మనోజ్ సమక్షంలో ఆమె కౌన్సిలర్‌గా ప్రమాణ స్వీకారం చేశారు.
ఈ సందర్భంగా ఎన్నికల అధికారి, సబ్ కలెక్టర్ మనోజ్ వసంతతో పదవీ నిబద్ధతపై ప్రమాణం చేయించారు. అనంతరం చింతల వసంత మాట్లాడుతూ.. తన గెలుపుకు సహకరించిన వార్డు ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఎమ్మెల్యే గడ్డం వినోద్ సహకారంతో 15వ వార్డు అభివృద్ధికి కృషి చేస్తా…
ప్రమాణ స్వీకారం తరువాత వసంత మీడియాతో మాట్లాడారు. బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ సహకారంతో 15వ వార్డును అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపిస్తానని ధీమా వ్యక్తం చేశారు. వార్డులోని డ్రైనేజీ, తాగునీరు, అంతర్గత రహదారుల వంటి మౌలిక సమస్యల పరిష్కారమే తన ప్రథమ ప్రాధాన్యతని, ఎమ్మెల్యే అండదండలతో వార్డును ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతానని ఈ సందర్భంగా ఆమె స్పష్టం చేశారు.
కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, వార్డు ప్రజల అంచనాలకు అనుగుణంగా పనిచేస్తూ ప్రజలందరికీ నిరంతరం అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొని వసంతకు శుభాకాంక్షలు తెలిపారు.
