Bus stand | ఆర్‌ఓ మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభం…

Bus stand | ఆర్‌ఓ మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభం…
Bus stand | తిరువూరు, ఆంధ్రప్రభ : తిరువూరు నియోజకవర్గ కేంద్రంలోని ఏపీఎస్ఆర్టీసీ బస్టాండ్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన ఆర్‌ఓ మినరల్ వాటర్ ప్లాంట్‌ను తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ప్రారంభించారు. రానున్న వేసవి కాలంలో ప్రయాణికులకు తాగునీటి సమస్య తలెత్తకుండా ఈ ప్లాంట్ ఎంతో ఉపయోగపడుతుందని ఆయన తెలిపారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు విచ్చేయగా డిపో మేనేజర్, సిబ్బంది ఘన స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ప్రయాణికుల సౌకర్యాలే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, బస్టాండ్‌లో ఏర్పాటు చేసిన ఈ ఆర్‌ఓ ప్లాంట్ ద్వారా రోజూ వందలాది మంది ప్రయాణికులు శుద్ధమైన మినరల్ వాటర్ పొందగలుగుతారని పేర్కొన్నారు. ఈ ప్లాంట్ ఏర్పాటు చేసిన నూతక్కి వెంకట రామారావు కుమారులు నూతక్కి వెంకట రమేష్ బాబు, నూతక్కి వేణు గోపాలరావులను అభినందించారు. అనంతరం మహిళా ప్రయాణికులతో మాట్లాడిన ఎమ్మెల్యే, కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత బస్సు ప్రయాణ పథకం అమలు తీరును తెలుసుకున్నారు.

ప్రయాణికులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకుని, వాటి పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తిరువూరు ఆర్టీసీ డిపో మేనేజర్ ఎ. సుబ్రహ్మణ్యం, సిబ్బంది, పట్టణ కూటమి పార్టీ నాయకులు పాల్గొన్నారు. ప్రయాణికుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని బస్టాండ్‌లో మరిన్ని మౌలిక వసతులు కల్పించేందుకు చర్యలు చేపడతామని ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు తెలిపారు.
