Maktal | మహా శివరాత్రి ఉత్సవాలకు ముస్తాబైన ఉమామహేశ్వరాలయం..

Maktal | మహా శివరాత్రి ఉత్సవాలకు ముస్తాబైన ఉమామహేశ్వరాలయం..
నేడు మహాశివరాత్రి శ్రీ ఉమామహేశ్వరుల కళ్యాణ మహోత్సవం
విద్యుద్దీపాలతో మహా శివరాత్రి ఉత్సవాలకు ముస్తాబైన శ్రీ ఉమామహేశ్వరాలయం
Maktal | మక్తల్ , ఆంధ్రప్రభః మహాశివరాత్రి పర్వదినం కోసం మక్తల్ పట్టణంలోని ఆజాద్ నగర్ లో వెలసిన అతి పురాతనమైన శ్రీ ఉమామహేశ్వరాలయం ముస్తాబయ్యింది. ఆలయాన్ని రంగు రంగుల విద్యుత్ దీపాలతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు .మహాశివరాత్రి వేడుకల్లో భాగంగా 15న ఆదివారం రోజు తెల్లవారుజామున 4 గంటలకు మహా రుద్రాభిషేకం జరుగనున్నట్లు ఆలయ అర్చకులు సిద్దిరామయ్య స్వామి తెలిపారు. అనంతరం భక్తుల చేత అభిషేకాలు కొనసాగుతాయని ఆయన తెలిపారు .రాత్రి 9:30 గంటలకు శ్రీ ఉమామహేశ్వరుల కళ్యాణ మహోత్సవం నిర్వహించడం జరుగుతుందని ఆయన తెలిపారు .అనంతరం భజన ,జాగరణ కార్యక్రమం కొనసాగుతుందని అన్నారు. అర్ధరాత్రి 11:40 గంటల నుండి 12 :20 గంటల మధ్య ఉధ్బవలింగ అభిషేక కార్యక్రమం కొనసాగుతుందన్నారు.
మహాశివరాత్రి సందర్భంగా శ్రీ ఉమామహేశ్వరాలయం లో జరగనున్న రుద్రాభిషేకం, అభిషేకం ,శ్రీ ఉమామహేశ్వరుల కళ్యాణ మహోత్సవం లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాలను విజయవంతం చేస్తూ శ్రీ ఉమామహేశ్వరుల కృపకు పాత్రులు కావల్సిందిగా ఆలయం కమిటీ సభ్యులు అక్కల సత్యనారాయణ, బి. ఆంజనేయులు సూర్య ,సి.వి. ఆంజనేయులు ,బి .శ్రీనివాసులు ,పోలేపల్లి అనంతకుమార్ విజ్ఞప్తి చేశారు.17న మంగళవారం రోజు అమావాస్య సందర్భంగా స్వామివారికి తెల్లవారుజామున 4:00 గంటలకు మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం జరుగుతుందన్నారు. అనంతరం 12 గంటలకు మహా మంగళహారతి భజన కార్యక్రమాలు ఉంటాయని వారు తెలిపారు. మద్యాహ్నం ఒకటి గంటలకు అన్నదాన కార్యక్రమం ఉంటుందని వారు తెలిపారు. ఈ వేడుకలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొనవలసినదిగా విజ్ఞప్తి చేశారు.
