Shivanagar | విద్యుత్తు దీపాలంకరణలో మార్కండేయ..

Shivanagar | విద్యుత్తు దీపాలంకరణలో మార్కండేయ..

విద్యుదీపాలంకరణలో శివనగర్ మార్కండేయ దేవాలయం
సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన శివాలయాలు

Shivanagar | కరీమాబాద్ , ఆంధ్రప్రభః మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని పలు శివాలయాలను విద్యుత్ దీపాలంకరణతో తీర్చిదిద్దారు. తూర్పు లోని 34 డివిజన్ శివనగర్, శ్రీ శివ భక్త మార్కండేయ దేవాలయం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయం, శివ నగరేశ్వర స్వామి దేవాలయం, ఎస్ ఆర్ ఆర్ తోటలోని శ్రీ దుర్గ మల్లేశ్వర స్వామి దేవాలయం, కరీమాబాదులోని కాశీ విశ్వేశ్వర స్వామి, పెరిక వాడలోని శివాలయం, ఆకారపు శివ దేవాలయం,పలు దేవాలయాలను శనివారం సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. నేడు మహాశివరాత్రి పురస్కరించుకొని ఉదయం ఐదు గంటల నుండి విశేషా పూజలు, అభిషేకాలు రాత్రి 8 గంటలకు అఘోర పాశుపత హోమం, అర్ధరాత్రి 12 గంటలకు లింగోద్భవం, పంచామృత అభిషేకాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ నిర్వాహకులు పూజారులు తెలిపారు.

Leave a Reply