Hospital | వీర సైనికులకు నివాళులు…

Hospital | వీర సైనికులకు నివాళులు…

Hospital | డోన్ టౌన్, ఆంధ్రప్రభ : పుల్వామా దాడిలో రక్తం చిందించి వీరమరణం పొందిన సి.ఆర్.పి.ఎఫ్ జవానులను స్మరిస్తూ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ రవి శేఖర్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. నంద్యాల జిల్లా డోన్ పట్టణంలోని ఆరోగ్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు పెద్ద ఎత్తున రక్తదాన కార్యక్రమం నిర్వహించారు.. ఈ రక్తదాన శిబిరంలో ఆంధ్రప్రభ డోన్ విలేకరి ప్రవీణ్ బాధితుల కోసం రక్తం ఇచ్చిన సంఘటన చోటు చేసుకుంది.

రక్తం మరొకరికి ప్రాణదానం చేస్తుందని రక్తము ఇచ్చిన ప్రవీణ్ ను అభినందించారు. అనంతరం రిటైర్డ్ ఆర్మీ వారికి శాలువాతో సత్కరించి రెండు నిమిషాలు మౌనం పాటించి నివాళులు అర్థించారు.. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… దేశం కోసం ప్రాణాలర్పించిన వీర సైనికులను గుర్తుంచుకోవలసిన అవసరం దేశ ప్రజలందరికీ ఉందని తెలిపారు. వీర జవానులు లేనిదే మనం లేం అని వారు గుర్తు చేశారు. పుల్వామా దాడి మన దేశానికి చీకటి రోజు అవుతుందని, ప్రాణ త్యాగం చేసిన వీర సైనికుల సేవలను స్మరించుకోవాలని తెలిపారు.

అందుకే ఈరోజును బ్లాక్ డే గా పిలుస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఆర్మీ, జిల్లా ఉపాధ్యక్షుడు సందు వెంకటరమణ, బీజేపీ మండల అధ్యక్షుడు, అడ్వకేట్ బొంకూరి రవికుమార్, బీజేపీ యువ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి సొప్పాకుల విజయభాస్కర్, టిడిపి పట్టణ అధ్యక్షుడు టి ఈ రాఘవేంద్ర గౌడ్, జనసేన నియోజకవర్గ నాయకుడు అలా మోహన్ రెడ్డి, డోన్ జె.కె టైర్స్ డీలర్ వై హనుమంత రెడ్డి, ఈ మోహన్ గౌడ్, కూటమి నాయకులు, కార్యకర్తలు, రక్తదాతలు పాల్గొన్నారు.

Leave a Reply