Clearance | ముమ్మరంగా జంగిల్ క్లియరెన్స్ పనులు

Clearance | ముమ్మరంగా జంగిల్ క్లియరెన్స్ పనులు
Clearance | కోడూరు – ఆంధ్రప్రభ : కోడూరు మండల పరిధిలోని పిట్టలంక నుండి పెదకళ్ళేపల్లి దేవస్థానముకు భక్తులు భారీగా వెళ్లే మార్గంలోపిట్టలంక గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో జంగిల్ క్లియరెన్స్ పనులు చేపట్టారు. పెద్ద కల్లేపల్లి స్వామివారి దర్శనానికి కోడూరు మండలం లోని పలు గ్రామాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు పిట్టలంక రేవు వద్దకు చేరుకుని అక్కడ నుండి పడవ మీద పెదకళ్ళేపల్లి వెళ్లి స్నానాలను ఆచరిస్తారు.
ఈ నేపద్యంలో వేల సంఖ్యలో వచ్చే భక్తుల కోసం ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా రోడ్డుకి రెండు పక్కల ఉన్న ముళ్ళపదులను ప్రత్యేకంగా జెసిబి ఏర్పాటు చేసి తొలగింపు చేశారు. జరుగుతున్న పనులు గ్రామపంచాయతీ సర్పంచ్ కనగాల వెంకటేశ్వరరావు పరిశీలించారు. ఉప సర్పంచ్ బావి శెట్టి ప్రభాకర్ రావు, కార్యదర్శి కడవకొల్లు సుధీర్ తదితరులు పాల్గొన్నారు.
