CHIRANJEEVI| ఏం నేమ్స్ పెట్టారంటే?

ఏం నేమ్స్ పెట్టారంటే..?

  • క‌వ‌ల‌ల‌కు నామ‌క‌ర‌ణ మ‌హోత్స‌వం
  • మెగా ఇంటిలో పండ‌గ వాతావ‌ర‌ణం
  • అబ్బాయి శివ‌రామ్‌, అమ్మాయి అన్వీరా దేవి
  • కుటుంబ సభ్యులు, బంధువుల సమక్షంలో వేడుక

ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : మెగా కుటుంబంలో పండగ వాతావరణం నెలకొంది. కొణిదెల వార‌సుల‌కు నామ‌క‌ర‌ణ మ‌హోత్స‌వాన్ని నిర్వ‌హించారు. మెగా పవర్ స్టార్ రాంచరణ్, ఉపాసన కొణిదెల దంపతులు ఇటీవల పండంటి కవలలకు జన్మినిచ్చారు. జనవరి 31న ఉపాసన మగ బిడ్డ, ఆడ బిడ్డలకు జన్మనివ్వడంతో మెగా ఫ్యామిలీలో ఆనందం వెల్లివెరిసింది. ఇక ఈ శుభవార్త విన్న తర్వాత అభిమానులు కూడా సంబరాలు చేసుకున్నారు. అలాగే ఇప్పుడు సంప్రదాయంగా నామకరణ మహోత్సవం కూడా నిర్వహించినట్లు తెలుస్తోంది. అయితే ఫిబ్రవరి 11వ తేదీన ఆ ఇద్దరు చిన్నారుల బారసాల జరిగింది. పండితుల సూచలు, సలహాలతో కేవలం కుటుంబ సభ్యులు, బంధువుల సమక్షంలో ఈ వేడుకను నిర్వహించినట్లు తెలుస్తోంది. పిల్లల జాతకం, జన్మనక్షత్రాల ప్రకారం కూతురికి అన్వీరా దేవీ, కుమారుడికి శివరామ్ అని పేర్లు పెట్టినట్లు తెలుస్తోంది. అన్వీరా దేవి అంటే ధైర్యవంతురాలైన అమ్మవారు అని వస్తుంది. అలాగే చిరంజీవి అసలు పేరు లోని శివ, రామ్ చరణ్ పేరులోని రామ్ ను తీసుకుని కుమారుడికి శివ రామ్ అని నామకరణం చేశారు. దీంతో మరోసారి మెగాస్టార్ ఫ్యామిలీ ధర్మంపై ఉన్న నిబద్దతను చాటుకున్నారని చెప్పుకోవచ్చు.

2012లో రామ్‌ చరణ్‌- ఉపాసన వివాహ బంధంతో ఒక్కటవ్వగా, 2023లో వీరికి క్లీంకార జన్మించింది. ఆమె పేరుకూ ప్రత్యేక అర్థం ఉంది. లలిత సహస్రనామ పారాయణంలో అమ్మవారిని కొలిచే పేర్లలో ఒకటి అది. ఏదేమైనా కుటుంబ వారసత్వం, పెద్దలపై గౌరవం, భక్తి, సంప్రదాయాలను సహా ఇలాంటి ముఖ్య విషయాలు దృష్టిలో పెట్టుకుని చరణ్, ఉపాసన తమ ముగ్గురు పిల్లలకు పేర్లు పెట్టారని చెప్పడంలో ఎలాంటి డౌట్ అక్కర్లేదు.

Leave a Reply