Vijay | ఉరి వేసుకొని మృతి…

Vijay | ఉరి వేసుకొని మృతి…
Vijay | వర్ని, ఆంధ్రప్రభ : వర్ని పోలీస్ స్టేషన్ పరిధిలోని మల్లారం అటవీ ప్రాంతంలో విజయ్ అనే వ్యక్తి ఉరివేసుకొని మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. బీర్కూరు మండలం కృష్ణాపూర్ గ్రామానికి చెందిన విజయ్ ట్రాక్టర్ డ్రైవర్ గా నిజామాబాద్ లో పనిచేస్తున్నాడు.
ఆర్థికపరమైన ఇబ్బందులు తట్టుకొలేక ఉరివేసుకొని చనిపోతున్నట్లు ఫోన్ ద్వారా తల్లికి సమాచార అందించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు గాలింపు చర్యలు చేపట్టగా మల్లారం అటవీ ప్రాంతంలో చెట్టుకు ఉరివేసుకొన్న విజయ్ మృత దేహాన్ని పోలీసులు కనుగొన్నారు.
