success | పీసీసీని కలిసిన కాంగ్రెస్ విజేతలు

success | పీసీసీని కలిసిన కాంగ్రెస్ విజేతలు

success | భీంగల్ టౌన్, ఆంధ్రప్రభ : భీంగల్ మున్సిపల్ రెండో విడుత సాధారణ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు పీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ను కలిశారు. బాల్కొండ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి ముత్యాల సునిల్ కుమార్, రాష్ట్ర సహకార సంఘాల చైర్మన్ మానాల మోహన్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నాగేష్ రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వేణుగోపాల్ యాదవ్ ల ఆధ్వర్యంలో పీసీసీని నూతన కౌన్సిలర్ సభ్యులు కలిశారు.

విజయం సాధించిన కౌన్సిలర్ లకు పీసీసీ శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ని నమ్మి విజయం అందించిన భీంగల్ పట్టణ ప్రజలకు పీసీసీ ధన్యవాదములు తెలిపారు. పట్టణ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని ఈ సందర్బంగా పీసీసీ పేర్కొన్నారు. నూతన కౌన్సిలర్లు సంటి లత, ఆరెపల్లి శ్రీజ, పర్శ కుశలత, తోట సతీష్, బోదిరే నాగమణి, అంజుమ్ అలీ, సందీప్, సంగ్యా నాయక్ లతో పాటు పార్టీ మండల అధ్యక్షులు బోదిరే స్వామి, పట్టణ అధ్యక్షుడు నర్సయ్య తదితరులు ఉన్నారు.

Leave a Reply