శిశుమందిర్ లో పోషకుల అవగాహన సదస్సు

ముధోల్, ఆంధ్రప్రభ : ముధోల్ మండల కేంద్రములోని శ్రీ సరస్వతీ శిశు మందిర్ కోలి గల్లి ప్రీ ప్రైమరీ పాఠశాలలో నర్సరి నుండి యూకేజి వరకు గల విద్యార్థుల పోషకులకు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో ప్రధానాచార్యులు సారథి రాజు శిశు మందిరాల లక్ష్యం, పోషక అవగాహన సదస్సు ఏర్పాటుకు గల కారణాల గురించి తెలియగా శ్రీ సరస్వతీ విద్యాపీఠం నిర్మల్ జిల్లా ఉపాధ్యక్షులు ధర్మపురి సుదర్శన్ ప్రధాన వక్తగా పాల్గొని పంచ పరివర్తన్ అంశాలైన కుటుంబ వ్యవస్థ, పర్యావరణ పరిరక్షణ, సమానత, మన విధులు, టివి , సెల్ ఫోన్ లో వాడకం, జంక్ ఫుడ్, హెల్తీ ఫుడ్ మొదలగు విషయాలపై మార్గదర్శనం చేశారు. ఈ సమావేశంలో 85 మంది పోషకులు పాల్గొని వారి అభిప్రాయాలను వెల్లడించారు. విద్యార్థుల మరియు పాఠశాల అభివృద్ధికి అవసరమైన సలహాలు సూచనలు అందించారు ఈ సందర్భంగా సంతృప్తని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల అధ్యక్షులు కొండావార్ సంజీవ్, పాఠశాల కార్యదర్శి వేదపాఠక్ నిశికాంత్ , ఆచార్యులు , పోషకులు, తదితరులు పాల్గొన్నారు.
