Anniversary | జీవిత బీమా చేయించుకోండి… ధీమాగా జీవించండి..

Anniversary | ఊట్కూర్, ఆంధ్రప్రభ : ప్రతి ఒక్కరూ జీవిత బీమా చేయించుకుని ధీమాగా జీవించాలని ఊట్కూర్ తాసిల్దార్ చింత రవి,నారాయణపేట ఎస్బిఐ బ్యాంకు మేనేజర్ రాజకుమార్, ఎల్ డీఎం విజయ్ కుమార్ అన్నారు. బుధవారం నారాయణపేట జిల్లా ఊట్కూర్ తాసిల్దార్ కార్యాలయం వద్ద ఎస్బిఐ ఆధ్వర్యంలో ఆర్థిక అక్షరాస్యత వార్షికోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అక్షరాస్యతతోనే అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించవచ్చనిఅన్నారు. ప్రతి ఒక్కరు సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెడుతున్న వివిధ సంక్షేమ పథకాలు సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్నారు.
సెల్ ఫోన్ లకు వచ్చే మోసపూరిత యాప్ లపట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. మహిళలు బ్యాంకుల్లో డబ్బులు జమ చేసుకొని జీవితంలో ఆర్థికంగా ఎదిగేందుకు కృషి చేయాలన్నారు. బాల కార్మిక వ్యవస్థ బాల్య వివాహాలను నిర్మూలించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు. చట్టాలపై అవగాహన కలిగి ఉండడంతో పాటు నిరక్షరాశులకు అవగాహన కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఐకెపి ఎపిఎం వనిత కుమారి, ఎస్బిఐ కౌన్సిలర్ ఎస్ కే. చాంద్ సుల్తానా, మహిళా సంఘం సభ్యులుతదితరులు పాల్గొన్నారు.
