Trade Deal | పడిపోయిన ఐటీ షేర్లు

Trade Deal | పడిపోయిన ఐటీ షేర్లు

Trade Deal | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : దేశీయ స్టాక్‌ మార్కెట్లు ఇవాళ ఫ్లాట్‌గా ముగిశాయి. భారత్‌-అమెరికా మధ్య ట్రేడ్‌ డీల్‌ కారణంగా మూడు రోజుల పాటు లాభాలు చవిచూసిన సూచీలు, ఐటీ, ఎఫ్‌ఎంసీజీ షేర్లలో అమ్మకాల ఒత్తిడితో మోస్తరు శ్రేణిలోనే కదలాడాయి. సెన్సెక్స్‌ 40.28 పాయింట్ల నష్టంతో 84,233.64 వద్ద, నిఫ్టీ 18.70 పాయింట్ల లాభంతో 25,953.85 వద్ద ముగిశాయి.

టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ వంటి షేర్లు నష్టపోగా, ఎస్‌బీఐ, మారుతీ సుజుకీ, రిలయన్స్ షేర్లు లాభపడ్డాయి. డాలరుతో రూపాయి మారకం విలువ 90.70గా ఉంది. మరోవైపు ఐటీ షేర్లు పడిపోయాయి. టీసీఎస్ 2 శాతానికి పైగా క్షీణించింది. హెల్సీఎల్ టెక్నాలజీస్, ఎటర్నల్, ఐటీసీ ఇతర టాప్ లూజర్స్లో జాబితాలో చేరాయి. రంగాలవారీగా నిఫ్టీ హెల్త్ కేర్ 1.62 శాతం లాభపడగా, నిఫ్టీ ఆటో 1.3 శాతం లాభపడ్డాయి. దీనికి విరుద్ధంగా, నిఫ్టీ ఐటీ సెషన్ లో అతిపెద్ద లూజర్గా ఉద్భవించింది.

Leave a Reply