Vikarabad | హస్తం గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించండి…

Vikarabad | వికారాబాద్, ఆంధ్రప్రభ : వికారాబాద్ మునిసిపల్ పరిధిలోని పదో వార్డు అనంతగిరిపల్లిలో ప్రజలు హస్తము గుర్తు ఓటు వేసి ఆశీర్వదిస్తే వార్డును మున్సిపాలిలో ఆదర్శవడుగా తీర్చిదిద్దు తమని పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు మాజీ మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ సుధాకర్ రెడ్డి తెలిపారు. బుధవారం వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని అనంతగిరిపల్లిలో ఆయన హోటలతో మాట్లాడారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి నాయకత్వాన స్పీకర్ ప్రసాద్ లో ప్రభుత్వం కొనసాగుతున్న నేపథ్యంలో వికారాబాద్లో కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ చైర్పర్సన్ గా గడ్డం అనన్య ఎన్నికల కావడం ఖాయమని అధికార పార్టీని గెలిపిస్తే అభివృద్ధి పనులు వేగవంతంగా జరుగుతాయని అన్నారు.
