Machilipatnam | రోగులను ఆదుకోవడంలో ఎంతో ఆనందం…

Machilipatnam | రోగులను ఆదుకోవడంలో ఎంతో ఆనందం…
- మచిలీపట్నం మానవతా కార్యదర్శి హసీంబేగ్
Machilipatnam | మచిలీపట్నం, ఆంధ్రప్రభ : మానవతా దృక్పథంతో రోగులను పేద విద్యార్థులను ఆదుకోవడంలో ఎంతో ఆనందం ఉంటుందని మచిలీపట్నం మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ కార్యదర్శి మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ డా. హసీంబేగ్ అన్నారు. ఇంగ్లీషుపాలెం లో హసీంబేగ్ కార్యాలయంలో బుధవారం బైపాస్ హార్ట్ సర్జరీ చేయించుకున్న పెయింటర్ సయ్యద్ గౌస్ కు, ఆయన భార్య సుభాని బేగం కు నిత్యవసర వస్తువులు, దుస్తులు, నగదు రూ. 10వేలును అందజేశారు. మచిలీపట్నం మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి సంస్థ అధ్యక్షుడు జి కిషోర్ కుమార్ అధ్యక్షత వహించి మాట్లాడారు.
ఈ రెండు నెలల్లో జర్నలిస్టులకు, సచివాలయ ఉద్యోగులకు మెగా మెడికల్ క్యాంపులు నిర్వహిస్తున్నామన్నారు. రిజిస్ట్రారు కార్యాలయం వద్ద మొక్కలు నాటే కార్యక్రమం చేబడుతున్నామన్నారు. పదవ తరగతి విద్యార్థులకు కెరీర్ గైడెన్స్ ఇస్తున్నామన్నారు. డా. హాసీంబేగ్ మాట్లాడుతూ మచిలీపట్నం లో పేద విద్యార్థులకు క్యాన్సర్ రోగులకు కుష్టు వ్యాధిగ్రస్తులకు సేవలందిస్తున్నామన్నారు జిల్లా విద్యా నిధి కన్వీనర్ పి శ్రీరామ్ నేతృత్వంలో జిల్లాలో వివిధ మండలాల్లో పేద విద్యార్థులకు సాయం అందిస్తున్నామన్నారు. జిల్లా మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ కో కన్వీనర్ ముదిగొండ శాస్త్రి మాట్లాడుతూ త్వరలో స్టార్ స్కూలు వద్ద మెగా మెడికల్ క్యాంపు నిర్వహిస్తున్నామని క్యాన్సర్ పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు.
