AP | గుణదల మేరీమాత దివ్య బలి పూజలో దేవినేని అవినాష్

AP | గుణదల మేరీమాత దివ్య బలి పూజలో దేవినేని అవినాష్

బిషప్‌లు, ఫాదర్లతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు
మేరీ మాత ఆశీస్సులు రాష్ట్ర ప్రజలపై ఉండాలని ఆకాంక్ష

AP | విజయవాడ, ఆంధ్రప్రభ : ఆంధ్ర రాష్ట్రంలో ప్రసిద్ధి గాంచిన విజయవాడ గుణదల మేరీమాత పుణ్యక్షేత్రంలో వార్షిక ఉత్సవాల సందర్భంగా బుధవారం నిర్వహించిన సమిష్టి దివ్య బలి పూజ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా బిషప్‌లు, ఫాదర్లతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి మేరీ మాత ఆశీస్సులు స్వీకరించారు. అనంతరం ఉత్సవ నిర్వాహకులు దేవినేని అవినాష్‌ను శాలువాతో సత్కరించి జ్ఞాపికను అందజేశారు. మేరీ మాతను దర్శించుకోవడం తనకు అదృష్టంగా భావిస్తున్నానని అవినాష్ తెలిపారు.

AP

మేరీ మాత ఆశీస్సులు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌తో పాటు రాష్ట్ర ప్రజలపై సమృద్ధిగా ఉండాలని కోరుకున్నట్లు చెప్పారు. దర్శనానికి వచ్చే భక్తులకు గుణదల పుణ్యక్షేత్రంలో చేసిన ఏర్పాట్లు ప్రశంసనీయంగా ఉన్నాయని, ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో అత్యంత ఘనంగా జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో శాసనసభ ఫ్లోర్ నాయకుడు వెంకట సత్యనారాయణ, నగర పాలక సంస్థ సభ్యులు అంబడిపూడి నిర్మల కుమారి, భీమిశెట్టి ప్రవల్లిక, కలాపాల అంబేద్కర్, పార్టీ నాయకులు గుమ్మడి విజయ్ కుమార్, డేవిడ్ రాజు, మాతంగి రాజేష్, చందా కిరణ్, భద్రి ప్రకాష్, బుచ్చిబాబు తదితరులు పాల్గొన్నారు.

AP
AP

Leave a Reply