Minister | ఓటు హక్కును వినియోగించుకున్న మంత్రి కోమటిరెడ్డి

Minister | ఉమ్మడి నల్లగొండ బ్యూరో, ఆంధ్రప్రభ : నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా 33వ డివిజన్‌లోని నల్లగొండ పబ్లిక్ స్కూల్‌లో రాష్ట్ర రోడ్లు, భవనాలు మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గారు తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు వజ్రాయుధం వంటిదని, ప్రతి పౌరుడు తప్పనిసరిగా తన ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.
