Brs| 4వ వార్డు అభివృద్ధే నా లక్ష్యం …

Brs| 4వ వార్డు అభివృద్ధే నా లక్ష్యం …
ఆదరించి గెలిపించండి అభివృద్ధి చేసి ప్రజల రుణం తీర్చుకుంటా..
ఆదర్శవంతమైన వార్డుగా తీర్చిదిద్దుతా 4వ వార్డు కౌన్సిలర్ బానోత్ బాలు.
Brs| కల్లూరు, ఆంధ్రప్రభ: నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు అందించేందుకు బిఆర్ఎస్ 4వ వార్డు అభ్యర్థిని గా బరిలో ఉన్నానని ఆదరించి గెలిపించుకోవాలని 4వ వార్డ్ అభ్యర్థి బానోతు బాలు కోరారు. కల్లూరు మున్సిపాలిటీ గా ఏర్పడిన తొలి దశలో ప్రజలకు సేవ చేసుకునే అవకాశం రావడం పూర్వజన్మ సుకృతమని, ప్రజలు ఆదరించి గెలిపించుకుంటే మున్సిపాలిటీలో ఆదర్శవంతమైన వార్డుగా తీర్చిదిద్దేందుకు అందరూ సహకరించాలని కోరారు. 4వ వార్డును అభివృద్ధి చేసి ప్రజల రుణం తీర్చుకుంటానని ఆయన అన్నారు. నేడు జరిగే మున్సిపల్ ఎన్నికలలో కారు గుర్తుపై తమ ఆమూల్యమైన ఓటు వేసి అత్యంత మెజార్టీతో గెలిపించుకోవాలని ఆయన కోరారు. బిఆర్ఎస్ పార్టీ హయాంలోనే అభివృద్ధి జరిగిందని మరల అభివృద్ధి జరగాలంటే కారు గుర్తుపై ఓట్లు వేసి ఆదరించి గెలిపించాలని అభివృద్ధి చేసి ప్రజల రుణం తీర్చుకుంటానని, ఆదరించి గెలిపించుకోవాలని ఆయన కోరారు.
