ఎల్లంకి వంశీ…కాంగ్రెస్ సైనికుడు

ఎల్లంకి వంశీ…కాంగ్రెస్ సైనికుడు
హస్తం గుర్తుకు ఓటేసి అవకాశం ఇవ్వండి…
ఆయన తరుపున అభివృద్ధికి మాట ఇస్తున్న
మంత్రి శ్రీధర్ బాబు
మంథని: మంథని మున్సిపల్ 13 వ వార్డు అభ్యర్థి ఎల్లంకి వంశీ కాంగ్రెస్ సైనికుడని, ఆయనను గెలిపించుకుంటే అభివృద్ధికి నాదే బాధ్యత అని మంత్రి శ్రీధర్ బాబు హామీ ఇచ్చారు. హస్తం గుర్తుకు ఓటేస్తే ఆశీర్వదించాలని ఆయన కోరారు. వంశీ కష్టం విలువ తెలిసి నాయకుడని, ఎదుటివారి అభివృద్ధి గురించి ఆలోచించే ఆయనను గెలిపించుకోవాల్సిన బాధ్యత అందరి పైన ఉందని మంత్రి తెలిపారు. అంబేద్కర్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన ప్రచారంలో మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ… 13 వ వార్డు తరఫున పోటీ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎల్లంకి వంశీధర్ చిన్ననాటితనం నుండి కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ ఎదిగాడని ఆయన గుర్తు చేశాడు. వంశీ గెలిస్తే యువతరాన్ని ప్రోత్సహించినట్లు అవుతుందని, 13 వార్డు ప్రజలందరూ ఆలోచించి హస్తం గుర్తుకు ఓటేసి వంశీని ఆశీర్వదించాలని మంత్రి శ్రీధర్ బాబు సూచించారు. గెలిచిన తర్వాత ప్రజా సంక్షేమ పథకాలు అమలు చేయిస్తానని ఆయన హామీ ఇచ్చారు . అందరికీ అందుబాటులో ఉండే వంశీని అభివృద్ధికి నాదే హామీ అని పేర్కొన్నారు.
