congress l వార్డు అభివృద్ధికి పాటుపడుతా.. చేతి గుర్తుకు ఓటేయండి..

congress l వార్డు అభివృద్ధికి పాటుపడుతా.. చేతి గుర్తుకు ఓటేయండి..
congress l సంగారెడ్డి, ఆంధ్రప్రభ: చేతి గుర్తుకు ఓటు వేసి దీవిస్తే ఏడో వార్డు అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని కాంగ్రెస్ పార్టీ బలపరిచిన ఏడో వార్డు కౌన్సిలర్ అభ్యర్థి గొల్ల వంశీ యాదవ్ అన్నారు. ఆయన ఇంటింటి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎన్నికల ప్రచారానికి చివరి రోజు కావడంతో గడపగడపకు వెళ్లి ఓటర్లను కలిసి, హస్తం గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్ పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ప్రజల నుంచి లభిస్తున్న స్పందనను చూస్తే విజయం ఖాయమని, ఇక మిగిలింది మెజార్టీ ఎంత అన్నదేనని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో కల్వకుంట ప్రజలు, ఏడో వార్డు ఓటర్లు పాల్గొని తమ మద్దతు తెలిపారు.
