అభివృద్ధి కోసం ప్రజల మద్దతుతో గెలవబోతున్న

అభివృద్ధి కోసం ప్రజల మద్దతుతో గెలవబోతున్న
11వ వార్డు బిజెపి అభ్యర్థి జయశ్రీ చిన్న కొండయ్య
చివరి రోజు జోరుగా ఇంటింటి ప్రచారం
రైటప్: ఓటు వేసి గెలిపించాలని కోరుతున్న పదకొండవ వార్డు బిజెపి అభ్యర్థి జయశ్రీ చిన్న కొండయ్య
మక్తల్ , ఫిబ్రవరి 9 (ఆంధ్రప్రభ) మక్తల్ మున్సిపల్ ఎన్నికల్లో ప్రజల మద్దతుతో కౌన్సిలర్‌గా గెలవబోతున్నానని 11వ వార్డు బిజెపి అభ్యర్థి జయశ్రీ చిన్న కొండయ్య అన్నారు.ఎన్నికల ప్రచారం చివరి రోజైనా సోమవారం వందలాదిమంది మహిళలు తో కలిసి 11వ వార్డు పరిధిలో భారీ ర్యాలీ నిర్వహిస్తూ ఇంటింట ముమ్మారంగా ప్రచారం చేపట్టారు .ఈ సందర్భంగా గడపగడపకు వెళ్లి ఎన్నికల్లో కమలం గుర్తుకు ఓటు వేసి తనను మున్సిపల్ కౌన్సిలర్ గా గెలిపించాలని కోరారు. వార్డు పరిధిలో ప్రచారం నిర్వహిస్తున్న జయశ్రీ చిన్న కొండయ్య కు ప్రజల నుండి అపూర్వ స్పందన లభించింది .ఎన్నికల్లో పూర్తి మద్దతు ఇస్తామని ప్రజలు భరోసా కల్పించడంతో జోరుగా ప్రచారాన్ని చేపట్టారు .
కేంద్రంలో బిజెపి ప్రభుత్వం పార్లమెంటు సభ్యురాలు డీకే. అరుణ సహకారంతో మక్తల్ అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులు తీసుకొస్తామని చెప్పారు .11వ వార్డుల్లో సీసీ రోడ్లు మురుగు కాలువలు నిర్మించి ఆదర్శవార్డుగా తీర్చిదిద్దుతామన్నారు. ఈ ప్రాంత వ్యక్తిగా ఇక్కడి సమస్యల పట్ల తనకు పూర్తి అవగాహన ఉందన్నారు . సమస్యలను పరిష్కరించడమే ధ్యేయంగా పనిచేస్తానని చెప్పారు. అభివృద్ధి కోసం ఈ నెల 11న జరగనున్న ఎన్నికల్లో కమలం గుర్తుకు ఓటు వేసి తనను మున్సిపల్ కౌన్సిలర్ కల్పించవలసిందిగా బిజెపి అభ్యర్థి జయశ్రీ చిన్న కొండయ్య విజ్ఞప్తి చేశారు .ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు నీవర్ధన్ రెడ్డి ,చెన్నారెడ్డి, నరసింహారెడ్డి ,బి .కుర్మయ్య ,దండు వెంకటయ్య, మేదరి మనోహర్ తో పాటు మందలాదిమంది మహిళలు పాల్గొన్నారు.
