Bhimgal l పోస్టల్ బ్యాలెట్ వేసిన 37 మంది
Bhimgal l పోస్టల్ బ్యాలెట్ వేసిన 37 మంది
Bhimgal l భీమ్‌గల్ టౌన్, ఆంధ్రప్రభః సాధారణ రెండో మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా భీంగల్ లో ఏర్పాటు చేసిన పోస్టల్ బ్యాలెట్ కేంద్రంలో 37 మంది పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకున్నారు. ఎన్నికల కమీషన్ ఆదేశాల మేరకు పోస్టల్ బ్యాలెట్ కేంద్రం ఏర్పాటు చేసిన సంగతి విధితమే. ఫిబ్రవరి 7 , 8 తేదీలలో 37 పోస్టల్ బ్యాలెట్ కు వినియోగించుకోగా అందులో 26 మంది పురుషులు, 11 మంది స్త్రీలు తమ ఓటు హక్కు ను వినియోగించుకున్నారు. పోస్టల్ బ్యాలెట్లు 37 కాగ, సర్వీస్ ఓటరు ఉన్నట్టు మొత్తం సర్వీస్ ఓటు తో కలిపి 38 అని మున్సిపల్ కమీషనర్ గోపు గంగాధర్ తెలిపారు.
