బీజని బాలమణికి మద్దతుగా

కొల్లూరు నాయకుల ప్రచారం

ఆలేరు,ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మున్సిపల్ పరిధిలోని 7 వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి బీజని బాలమణి భాస్కర్ కు మద్దతుగా శనివారం కాంగ్రెస్ పార్టీకి చెందిన కొల్లూరు ప్రజాప్రతినిధులు శనివారం ఇంటింటి ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. టిపిసిసి ప్రధాన కార్యదర్శి జనగాం ఉపేందర్ రెడ్డి, కొల్లూరు సర్పంచ్ జనగాం సుధారాణి, ఉప సర్పంచ్ గాజుల దశరథ, నాయకులు జనగాం శ్రీపాల్ రెడ్డి, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు ఎం ఏ ఎజాస్ తోపాటు పలువురు ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.