ఇంటింటి ప్రచారంలో మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి

మక్తల్ , ఆంధ్రప్రభ ; మక్తల్ మున్సిపాలిటీ లోని 11వ వార్డు లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నవీద బేగం ను ఆదరించి భారీ మెజార్టీతో గెలిపించాలని స్థానిక ఎమ్మెల్యే మంత్రి డాక్టర్ వాటి శ్రీహరి పిలుపునిచ్చారు. శనివారం 12వ వార్డు పరిధిలోని బురాన్ గడ్డలో నవీద బేగం కు మద్దతుగా చేపట్టిన ఇంటింటి ప్రచారంలో మంత్రి పాల్గొన్నారు. ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలకరిస్తూ కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని కోరుతూ ముందుకు సాగారు. అడుగడుగునా కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తామని ఆ ప్రాంత ప్రజలు మంత్రికి మాటిచ్చారు .ఈ సందర్భంగా డాక్టర్ వాకిటి శ్రీహరి మాట్లాడుతూ మక్తల్ పట్టణం అభివృద్ధి చెందాలంటే మునిసిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అధికారం అప్పగించాలని కోరారు. ప్రజా ప్రభుత్వం వచ్చాక అనేక అభివృద్ధి పనులు చేపడుతున్నామన్నారు .70 ఏళ్లలో జరగని అభివృద్ధి వందల కోట్ల రూపాయలతో మక్తల్ పట్టణంలో సిసి రోడ్లు మురుగు కాలువల నిర్మాణం పనులు చేపడుతున్నామని చెప్పారు.
