వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం

ఊర్కొండ, ఆంధ్రప్రభ ; మండల పరిధిలోని ఊరుకొండ పేట గ్రామంలో ఐకెపి ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని సర్పంచ్ అబ్దుల్ రషీద్ మంగళవారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వరి పంటకు కనీస మద్దతు ధర పొందాలంటే రైతులు ప్రభుత్వ నియమ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ధాన్యాన్ని బాగా ఆరబెట్టి కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని అన్నారు.
ఏ గ్రేడ్ వడ్లకు క్వింటాల్‌కు రూ. 2,389, సాధారణ రకానికి రూ. 2,369 చెల్లిస్తారని తెలిపారు. సన్న వడ్లకు రాష్ట్ర ప్రభుత్వం అదనంగా రూ. 500 బోనస్ మద్దతు ధర అందిస్తుందని వివరించారు.
రైతులు దళారులకు వడ్లు అమ్మి మోసపోకుండా, ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సీసీ పోచయ్య, రామస్వామి, ఐకెపి సభ్యులు మాధవి, మహిళ అధ్యక్షురాలు పార్వతమ్మ, పంచాయతీ కార్యదర్శి ఇబ్రహీం, రైతులు తదితరులు పాల్గొన్నారు.
