Tirupathi|తిరుమ‌ల కిట‌కిట‌

Tirupathi|తిరుమ‌ల కిట‌కిట‌

శ్రీవారి దర్శ‌నానికి 12గంటల సమయం

Tirupathi|ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : నేడు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 23 కంపార్ట్ మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వ దర్శనం క్యూ లైన్ లోకి ఉదయం ఏడు గంటలకు టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం పన్నెండు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. నిన్న తిరుమల శ్రీవారిని 67,085 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 24,832 మంది తలనీలాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.78 కోట్లు వచ్చిందని అధికారులు వెల్లడించారు.

Leave a Reply