ముమ్మరంగా కాంగ్రెస్ నాయకుల ఇంటింటి ప్రచారం

మక్తల్ , ఆంధ్రప్రభ : మక్తల్ మున్సిపల్ ఎన్నికల్లో 10వ వార్డు అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కర్రెం చెన్నమ్మ నీలప్పను ఆదరించి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం వార్డు పరిధిలో ఇంటింటా ప్రచారం ముమ్మరంగా చేపట్టారు. ఈ సందర్భంగా ప్రతి గడపకు వెళ్లి ఎన్నికల్లో పదవ వార్డు నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కర్రెం చెన్నమ్మ నీలప్ప ను గెలిపించడం వల్ల ఈ ప్రాంతంలో చేపట్టే అభివృద్ధి పనులను వివరించారు. ఈ ప్రాంతం అభివృద్ధిని కోరుకునే వారంతా కూడా కాంగ్రెస్కు ఓటు వేయాలన్నారు. స్థానిక ఎమ్మెల్యే మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి సహకారంతో ఈ ప్రాంత అభివృద్ధికి భారీ ఎత్తున నిధులు తీసుకువచ్చే బాధ్యత మాదని బరోసా ఇచ్చారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధితో పాటు బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి ఎన్నో పథకాలు అమలు చేస్తుందని చెప్పారు. రేషన్ కార్డు లేక నిరుపేద కుటుంబాలు అల్లాడిపోతున్న సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం అర్హులైన పేదలందరికీ రేషన్ కార్డులు ఇవ్వడం జరిగిందని గుర్తు చేశారు .రేషన్ కార్డు కొత్తగా పొందినవారు సన్న బియ్యం తింటూ సంతోషంగా ఉన్నారని గుర్తు చేశారు. అదేవిధంగా నివాసం లేని పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయిస్తామని చెప్పారు. అభివృద్ధి సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలి అన్నారు. ఈ నెల 11న జరగనున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కర్రెం చెన్నమ్మ నీలప్పను 10వ వార్డు నుండి మున్సిపల్ కౌన్సిలర్ గా గెలిపించి అభివృద్ధికి అండగా నిలవాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కర్రెం చెన్నమ్మ నీలప్ప మద్దతు దారులు పాల్గొన్నారు.

Leave a Reply